గోదావరి నది పారివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నది నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. భద్రాచలంతో పాటు ధవలేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతూ ఉండటంతో మామిడికుదురు మండల పరిధిలోని తీర గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలయ్యింది. పది రోజుల క్రితం వరద లంక గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే.