కుందుర్పి గ్రామ సమీపంలో శనివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న విరూపాక్షి (51) మృతి చెందాడు. కుందుర్పి మండలం జానం పల్లి గ్రామానికి చెందిన విరూపాక్షి బైక్ లో కుందుర్పి నుంచి జానం పల్లికి బయలుదేరాడు. అయితే బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తా పడింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.