కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాడా కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ చైత్రవర్షిని శనివారం సాయంకాలం నాలుగు గంటలకు ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను నివేదించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని ఆమె చెప్పారు.