ఒక్కరు రక్తదానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడవచ్చునని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సభ్యురాలు కమలాక్షి అన్నారు. కళ్యాణదుర్గంలోని ఓం శాంతి భవనంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆమె మాట్లాడారు. ఈనెల 24న ఓం శాంతి భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని రక్తదానం చేయాలన్నారు. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదన్నారు.