ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైరల్ జ్వరానికి చికిత్స అందించడంలో వైద్యులు విఫలమయ్యారని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ ఆరోపించారు. ASF (M) గుడిగుడికి చెందిన ఆత్రం రాంశ్యావ్ మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. గిరిజన బిడ్డలు ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స చేసే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యానికి వస్తున్నారన్నారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యులు మాత్రం కాలయాపన చేస్తూ జీతాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మృతికి కారకులైన వైద్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.