నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళ పోలీసు సిబ్బందికి ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షి లీడ్ నల్లగొండ బిలీవ్ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీసు సిబ్బందికి ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీధి నిర్వహణలో ఎదురయ్యే అనేక రకాల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ శిక్షణలో నేర్చుకున్న మేలుకువలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.