శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంకలో శ్రీ బాల గణపతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రూపాల్లో గణపతులు చేయడం ఆనవాయితిగా వస్తుంది. గతంలో వరి నారు గణపతి, నారికేళ గణపతి, వనమూలికల గణపతి, హరిద్ర గణపతి, పామాయిల్ గణపతి, గోధుమ నారు గణపతి ఇలా 20 ఏళ్ళ పాటు వినూత్నమైన ప్రముఖ శిల్పి భైరి తిరుపతి చేస్తున్నాడు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉద్దానం యూత్ క్లబ్ తయారు చేసిన విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది *కదంబ పుష్పాలు* తో తయారు చేసిన వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.