అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా నాయకులు నేతావత్ రాందాస్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జన్నారం బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి కావాలన్నారు. ప్రతి పేదవానికి భూమి ఇవ్వాలన్నారు. నిరుపేదలు నిరుపేదలు గానే ఉంటున్నారు తప్ప వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయడం లేదన్నారు. వెంటనే నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.