పాణ్యం మండలం గోరుకల్లు జలాశయంలో శనివారం సమయానికి 841.37 అడుగుల నీటి నిల్వ నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 856.3 అడుగులు. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 10.16 టీఎంసీల మేర నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 12.44 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలోకి ఇన్ ఫ్లో 8,046 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో రూపంలో 4,830 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారి ఈఈ శివప్రసాద్ తెలిపారు.