చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం పోతాన్పల్లి గ్రామనికి చెందిన తిరుపతి ఆంజనేయులు 49సం అనే వ్యక్తి తన వ్యవసాయ పొలం పక్కన పోతనపల్లి అటవి ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, గత 2రోజుల క్రితం పొలం వద్దకు వెళుతున్నాను ఇంట్లో చెప్పి వెళ్లాడని రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోయేసరికి చుట్టుపక్కల బంధువుల ఇంట్లో వద్ద వెతకగా తన వ్యవసాయ పొలం పక్కన అటవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడని, ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని కుమారుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు.