యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలానికి చెందిన కాంట్రాక్టర్ కృష్ణ తాను చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కుటుంబంతో సహా కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హనుమాన్పురం ,తాజ్పూర్ గ్రామాల్లో 42 లక్షల పనులు చేశానని అన్నారు ఇప్పటికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అప్పుల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు.