భారత విప్లవోద్యమ ధృవతార కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కొనియాడారు.స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్ అధ్యక్షతన జరిగిన సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.