నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం అందాజా మూడున్నర గంటల సమయంలో ఎంటిఓ ఆర్ఎస్ఐ శివ శంకర్ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు మోటర్ వాహన డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం టి ఓ మాట్లాడుతూ జిల్లా పోలీస్ స్టేషన్లో పెట్రోల్ కార్ విధులు నిర్వహించే వాహన డ్రైవర్లు పెట్రోలింగ్ వాహనాన్ని నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలని రాత్రి పెట్రోలింగ్ చేసే సమయంలో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్విరామంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ముందస్తు నేరాలు జరగకుండా చూడాలని తెలిపారు.