Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: నారాయణపురం తోటల్లో పనిచేసుకుంటున్న రైతులపై దాడికి పాల్పడిన ఎలుగుబంటి, ఆత్మరక్షణకై ప్రతి దాడిచేయడంతో ఎలుగుబంటి మృతి

Srikakulam, Srikakulam | Sep 6, 2025
మందస(M) నారాయణపురం గ్రామంలో శనివారం సమీప జీడి, కొబ్బరి తోటల్లో పనులు చేసుకుంటున్న రైతులపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, పున్నయ్య, మోహనరావు, సోమయ్యలు గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ఆత్మరక్షణకు గ్రామస్తులు ఎలుగుపై ప్రతి దాడికి దిగారు. ఈ దాడిలో బల్లోకం మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాశిబుగ్గ రేంజ్ అటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us