నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు సురేష్ పై గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ తో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శుక్రవారం పరామర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని శ్రీశైల నియోజకవర్గంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అండ తోనే వైసిపి నాయకుల పై టిడిపి శ్రేణులు దాడులకు దిగుతున్నారని తెలిపారు వీళ్లను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.