Araku Valley, Alluri Sitharama Raju | Sep 11, 2025
డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గత్తెరజిల్లెడ, అరకు మండలంలోని పెదబరడ పంచాయతీ గరడగూడ గ్రామాల్లో గురువారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పర్యటించారు. రైతులతో కలిసి ఆయా గ్రామాల్లో కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీ బెర్రీ బోరర్ తెగులు సోకిన కాఫీ తోటల్లో కేజీ కాఫీ పండ్లకు రూ. 100, ఎకరానికి రూ. 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.