ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరైన సమయంలో చేరేందుకు బ్యాంకులు ప్రధాన పాత్ర పోషించాలని డిఆర్ఓ మధుసూదన్ రావు బ్యాంకర్లను సూచించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్ లోని వీసీ హాలులో డిఆర్ఓ మధుసూదన్ రావు అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరైన సమయంలో చేరేందుకు బ్యాంకులు ప్రధాన పాత్ర పోషిస్తూ, జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు బ్యాంకింగ్ రంగం భాగస్వామ్యం కావాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి కీలకమైన అంశాలు, ముఖ్యంగా స్వయం ఉపాధి కోసం