శనివారం రోజున అర్ధరాత్రి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ మట్టి గణపతి వద్ద నిమజ్జనోత్సవం నిర్వహించారు నిమజ్జనోత్సవానికి ముందు లక్కీ డ్రా నిర్వహించడంతో లక్కీ కూపన్ లో జూలపల్లి మండలం కాచాపూర్ కు చెందిన రెండు రోజుల క్రితం జన్మించిన ఆర్య వర్ధన్ కు లక్కీ డ్రా లో స్కూటీ లభించి అదృష్టం వరించింది నిరుపేద కుటుంబానికి చెందిన తండ్రి లక్ష రూపాయల స్కూటీ తన కుమారునికి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు