కాఫీ తోటలకు పురుగు పట్టిందని దాని నుండి పంటను మాములు స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సుమారు 80ఎకరాల మేరకు వ్యాపించిందని, దీనిపై కమిటీ వేయడం జరిగిందన్నారు. ఎక్కడైతే ఈ పురుగు ఉత్పన్నామౌతుందో అక్కడ మళ్ళీ పురుగు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అరకు కాఫీ ముఖ్యమంత్రి మానసిక పుత్రికల చూస్తున్నారని, శాసన సభ ప్రాంగణంలో కూడా అరకు కాఫీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.