ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో స్వర్గీయ వేగనాటి కోటయ్య వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ సెంటర్, స్వగృహం వద్ద వేగినాటి కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో ప్రజలను ఉద్దేశించి కోటయ్య సేవలను కొనియాడారు.