రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి, తంతోలి గ్రామాలలోని పంట పొలాలను ఆయన ఆదివారం పరిశీలించారు. వెంటనే వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ: 25 వేలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో అన్నదాతల పక్షాన పోరాటాలు చేపడుతామన్నారు.