నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు రైతులు మృతి చెందినట్లు బుదవారం స్థానికులు తెలిపారు. పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన భార్య భర్తలు అల్లేపు ఎల్లయ్య,ఆల్లేపు ఏళ్లవ్వ వారి బంధువు మరో వ్యక్తి బండారు వెంకటి అనే ముగ్గురు గ్రామ సమీపంలోని పత్తి పంట సెనుకు వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగుపాటుతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఆ గ్రామానికి మార్గం మధ్యలో ఉన్న దొత్తి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కనీసం అంబులెన్స్ సైతం వెళ్ళలేని దుస్థితి ఉండడం బాధాకరమన్నారు.