కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నాం. మాస్టర్ ప్లాన్ తో కళ్యాణదుర్గం రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం లోని మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ 2047 పై సలహాలు, సూచనలు తీసుకోవడం కోసం శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వం అభివృద్ధిని అటకెక్కించిందన్నారు. అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.