జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నేడు శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఎస్ఐ నాగేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేసి నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి నూతన నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని, తెలిపి ఫైన్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై నాగేందర్ మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను నడపకూడదని పేర్కొన్నారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, వాహనానికి సంబంధించిన అనుమతి పత్రాలు తప్పనిసరిగా వాహనంలో ఉంచుకోవాలన్నారు. అతివేగం ప్రమాదకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అంజనేయులు ప్రవీణ్ కుమార్ కాని