నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో కన్నతల్లిని కన్న కొడుకు గొంతు నులిమి చంపిన సంఘటన చోటు చేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎండబెట్ల గ్రామానికి చెందిన అలివేలను అన్న కొడుకు శివ ,కోడలు ఆస్తికోసం శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అలివేలను గొంతునులుమీ చంపాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.