రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించండి మహిళను పార్వతీపురం శక్తి టీం సభ్యులు రక్షించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త సవర పెంటయ్య తో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు పార్వతీపురం రైల్వే స్టేషన్ కి వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు 112 కాల్ చేసి తెలియజేసింది. స్పందించిన శక్తి టీం సభ్యులు గురుమూర్తి రామలక్ష్మి బెలగం రైల్వే స్టేషన్ కి వెళ్లి మహిళను గుర్తించి ఆమెను రక్షించారు. జిల్లా ఎస్పీ శక్తి టీం సభ్యులను అభినందించారు.