నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామంలో గత కొన్ని రోజులుగా వరుస చోరీలకు దొంగలు తెగబడుతున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన దొంగలను స్థానికులు గుర్తించి పట్టుకోడానికి వెంటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన దొంగలు స్థానికుల నుంచి తప్పించుకుని పారిపోయారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు