ఆళ్లగడ్డ మైదుకూరు హైర్ బస్సు డ్రైవర్ మహమ్మద్పై జరిగిన దాడిని రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆమె ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోను తనిఖీ చేసి, మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన కారణంగా జిల్లా వ్యాప్తంగా హైర్ బస్సు డ్రైవర్లు ధర్నాలో పాల్గొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, డ్రైవర్కు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.