కడప జిల్లా దువ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో జేష్ఠది దివాకర్ అనే యువకుడు అనుమానస్పద మృతి చెందినట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగేందుకు గ్రామ శివారుకు వెళ్లినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దువ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతి కి గల కారణం పై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.