నూతనంగా కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ గా నియామకమైన దినేష్ గురువారం కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు నిర్ణీత సమయానికి ప్రయాణికులను గమ్యానికి చేర్చేలా ప్రణాళిక బద్ధంగా బస్సులను నడిపించాలని, విద్యార్థులకు, మహిళలకు, ఇతర సాధారణ ప్రయాణికుల ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలనిజిల్లా కలెక్టర్ ఆర్టిసి నూతన డిఎం కు సూచించారు.