ఆటోలతో ఉపాధి పొందుతున్న కార్మికులపై ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఆటోలతో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు మద్దిలేటి, పుల్లయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.