పెద్ద కొడప్ల్ పాఠశాలలో అగ్నిప్రమాదం, కంప్యూటర్ వస్తుసామాగ్రి దగ్ధం... కామారెడ్డి జిల్లా పెద్ద కొడపెల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం సాయంత్రం కంప్యూటర్ గది దగ్ధమైనట్లు సంబధిత ఉపాధ్యాయులు తెలిపారు.ఆదివారం సాయంత్రం పొగలు రావడం గమనించి చూడగా, గదిలోని కంప్యూటర్ పరికరాలు మంటల్లో కాలిపోతున్నట్లు స్థానికులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనతో పాఠశాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని విద్యార్థుల కంప్యూటర్ విద్యకు ఆటంకం ఏర్పడిందని పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం మధ్యాహ్నం 3:30 ఒక ప్రకటనలో తెలిపారు..