కాకినాడ, ఆగస్టు 26; టాటా మ్యాజిక్ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకి 1250/-రూ. చెల్లించి మహిళల ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం సిఐటియు ఆధ్వర్యంలో టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్స్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, యూనియన్ కాకినాడ అధ్యక్షుడు వాలిశెట్టి శ్రీను లు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ వాహనాలకు మహిళా ప్రయాణీకులే ఆధారమన్నారు. వాహనం తిరిగినా, తిరగకపోయినా 7గురు ప్యాసింజర్లు గల వాహనానికి క్వార్టర్లీ 5500రూ., 9 మంది ప్యాసింజర్లు ప్రయాణించే వాహనానికి క్వార్టర్లీ 7200రూ. ట్యాక్స్ చెల్లిస్తున్నా