విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డీ బోజా రెడ్డి పేర్కొన్నారు. శనివారం భోరజ్ మండలం సిరిసన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ ప్రారంభించారు.రూ.6 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్, రంగినేని శాంతన్ రావు, ప్రకాష్ రెడ్డి, రాజారాం కపిల్ తదితరులున్నారు.