బైక్ కట్ కొట్టడంతో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బోల్తా పడ్డ ఆటో... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం మద్య్హనం ఆటో బోల్తా పడింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు బట్టల లోడ్తో వెళ్తున్న ఆటో ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో బైక్ కట్ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. చిగురుమామిడికి చెందిన డ్రైవర్ బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న బట్టలు రోడ్డుపై పడ్డాయి.ఈ ప్రమాదంలో ఆటో పాక్షికంగా దెబ్బతింది.రోడ్డుపై బట్టలు పడడంతో ఎస్సై శ్రీకాంత్ గౌడ్, పోలీసులు, స్థానికులు పక్కకు జరిపారు.