పెద్ద కడబూరు: మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు రణభేరి కార్యక్రమం జరుగనుందని యూటీఎఫ్ నేతలు ప్రశాంత్, భూపాల్, శంకరయ్య తెలిపారు.రణభేరి యాత్ర ఈనెల 15 న కర్నూలులో ప్రారంభమవుతుందని తెలిపారు.