గణపతి నవరాత్రుల అనంతరం నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కపిలేశ్వరపురం తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ హరీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గోదావరి నదిలోని నిమజ్జన ఘాట్లను అధికారులు పరిశీలించి, అవసరమైన చోట బారికేడ్లు, పడవలు, గజఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో డీజే సౌండ్, బాణసంచా నిషేధమని, సాయంత్రం 5 గంటలలోగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు.