Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
ఉదయగిరి జిల్లా ఏర్పాటు అంశాన్ని మంత్రుల ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లాలని సీతారామపురం వైసీపీ నేతలు మంగళవారం MRO ఫజిహాకు వినతిపత్రం అందజేశారు.ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా ఏర్పాటు ఒక్కటే మార్గమన్నారు. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని వారు కోరారు