వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోశ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి అనుమతులు లేకుండా నిబంధనకు వ్యతిరేకంగా నడుపుతున్నారని సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించగా నేడు మంగళవారం ఎంఈఓ గోపాల్ స్పందించి శ్రీ చైతన్య ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న సందర్భంగా సీజ్ చేయటం జరిగింది. అనుమతులు లేకుండా ఏ పాఠశాలలో తరగతులను నిర్వహించకూడదని, ఎంఈఓ గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి శ్రీశైలం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.