పెద్ద కడబూరు : నకిలీ ఉల్లి విత్తనాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని నౌలేకల్ గ్రామ రైతులు కోరారు. చిన్నకడబూరు గ్రామానికి చెందిన బ్రోకర్ లక్ష్మన్న ద్వారా 11 మంది రైతులు 14 ఎకరాలకు అవసరమైన ఉల్లి విత్తనాలు కొన్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ఉల్లిగడ్డ పరిణామం చిన్నగానే ఉందని శుక్రవారం రైతులు వాపోయారు. సుమారు ఎకరాకు రూ.1.50లక్షలు పెట్టుబడి పెట్టామని తమకు నష్టపరిహారం చెల్లించి లక్ష్మన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు.