తిర్యాణి మండలం గంభీరావుపేట అటవీ ప్రాంతంలో పశువుల కాపరిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఆ గ్రామానికి చెందిన భూమయ్య పశువులను మోపడానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో వెళ్ళారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఎలుగు బంటి దాడి చేసి గాయపరిచింది. ఎలు గుబంటి బారి నుంచి తప్పించుకొని పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నాడు. తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.