క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని జిల్లా అదనపు కలెక్టర్.చంద్రయ్య అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లోనీ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా క్రీడా యువజన సేవల అధికారి హనుమంత రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనప కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు, ఒలంపిక్ స్వర్ణ విజేత, హాకీ మాంత్రికుడు గా పేరుపొందిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు