గ్యాస్ సిలిండర్ డెలివరీ ఫ్రీ గా చేయాల్సి ఉన్నా భారత్ గ్యాస్ ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆసిఫాబాద్ కు చెందిన గ్యాస్ వినియోగదారుడు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..ఆసిఫాబాద్ పట్టణంలో గ్యాస్ డెలివరీకి రూ. 30 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలా రోజుకు లక్షల్లో డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. వసూలు చేస్తున్నది డెలివరీ బాయ్స్ అయితే డబ్బులన్నీ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. కస్టమర్ల నుంచి డెలివరీ చార్జీలు మస్ట్ గా వసూలు చేయాలని డిస్టిబ్యూటర్లే చెబుతున్నారని అన్నారు.