యాదమరి మండలంలోని కాశిరాళ్ల పంచాయతీ పెరమాలపెంట గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో పాటు గ్రామంలోని మోరినీళ్లు రోడ్డుపై చేరడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం, వర్షం పడిన ప్రతిసారీ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీధులు, రహదారులు దుర్వాసనలతో దుర్భరంగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల కారణంగా గ్రామంలో వైరల్ ఫీవర్ విస్తరించి అనేక కుటుంబాలు బాధపడ్డాయి అని వారు గుర్తు చేశారు.