సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు, శ్రీపురం రేషన్ షాపులకు చెందిన 77 బస్తాల బియ్యం తడిచి పాడయ్యాయి. సివిల్ సప్లై గోడౌన్ నుంచి ఆయా డిపోలకు సరుకులు తెస్తున్న సమయంలో వ్యాన్ వరిచేలు పొలంలో శనివారం బోల్తా పడిన సంగతి తెలిసిందే. సంబంధిత డీలర్లు ఘటనా స్థలానికి వచ్చి బియ్యం బస్తాలను బయటకు తీయించారు. 197 బస్తాలకు గాను 77 బస్తాలు పాడయ్యాయని ఆదివారం అధికారులు తెలిపారు.