విశాఖలో మరోసారి చెలరేగిన మంటలు..రంగంలోకి ఇండియన్ నేవీ విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రో కెమికల్స్(ఈఐపీఎల్)లో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడి మంటలు ఏర్పడిన ట్యాంకర్ పై భాగంలో తాజాగా సోమవారం మధ్యాహ్నం మరోసారి మంటలు చెలరేగాయి. ఇథనాల్ ట్యాంకర్ పైభాగంలో పెద్ద ఎత్తున మంటలు అలముకున్నాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలు పట్ల విచారణ జరిపించి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.