ఆలయ ఉద్యోగి డబ్బులు కాజేసిన సైబర్ మోసగాళ్లు సైబర్ నేరగాళ్లు గంటల వ్యవధిలోనే రూ.లక్షలు కాజేసిన ఘటన కురవి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం ఆలయ ఉద్యోగి జగన్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు రూ.20 లక్షలు విత్ డ్రా చేశారు. గంటల వ్యవధిలోనే సైబర్ మోసగాళ్లు డబ్బులు ఖాతా నుంచి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.