గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం మధ్యాహ్నం సీఐటీయూ నాయకులు ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. జీఓ 51ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీపీ కార్మికులు 40 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని, నేటికి కనీస వేతనాలు, ఉద్యోగ భధ్రత లేదన్నారు.