కడప జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జనోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం తెలిసిన వివరాల మేరకు చక్రాయపేట మండలం మహాదేవపల్లె వాసులు గ్రామంలో లంభోదరునికి ఐదవ రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవం నిర్వహించి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.