జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని,వినాయక విగ్రహాలను కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద నిమజ్జనం చేస్తున్నారు. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాధులను గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తమ వాహనాలలో వినాయక విగ్రహాలను తీసుకువచ్చి, భక్తిశ్రద్ధలతో విగ్రహాలను అంతరాష్ట్ర వంతెన వద్ద గోదావరి ప్రవాహంలో నిమజ్జనం చేస్తున్నారు.